కల్ట్ క్లాసిక్ 'గీతాంజలి' రీ-రిలీజ్ డేట్ వచ్చేసింది

5930చూసినవారు
కల్ట్ క్లాసిక్ 'గీతాంజలి' రీ-రిలీజ్ డేట్ వచ్చేసింది
మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, గిరిజ శెట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ప్రేమకథా చిత్రం 'గీతాంజలి' ఆగస్టు 28న థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఇళయరాజా సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ వంటి అద్భుతమైన అంశాలతో విజువల్ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ మళ్ళీ విడుదల చేస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతంతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్