కర్ణాటకలోని కలబురగి ప్రభుత్వ పీయూ కళాశాలలో తరగతి గదిలో పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.