AP: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేల సందడి మొదలైంది. భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు జరుగుతుండగా, పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. నిర్వాహకులు కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.