ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకునే ఆస్కార్ అవార్డుల వేడుకలకు సంబంధించి అకాడమీ కీలక ప్రకటన చేసింది. 99వ ఆస్కార్ వేడుకను 2027 మార్చి 14న, 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నారు. 2029 నుంచి డాల్బీ థియేటర్‌కు బదులుగా లాస్ ఏంజిల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో వేడుకలు జరుగుతాయి. అంతేకాకుండా, 2029 నుంచి ఆస్కార్ వేడుకలను నేరుగా యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబోతున్నారు. గత ఏడాది ప్రేక్షకుల నుంచి వ్యూస్ తగ్గిన నేపథ్యంలో గ్లోబల్ రీచ్ పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.