చేతిరాత సరిగా లేకపోవడం వల్ల ఒక వ్యక్తి తెలివితక్కువవాడు లేదా నిర్లక్ష్యంగా ఉంటాడని భావించడం సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేగంగా ఆలోచిస్తూ, సమాచారాన్ని త్వరగా నమోదు చేసే సమయంలో మెదడు అధికంగా పనిచేయడం వల్ల చేతిరాత గజిబిజిగా మారే అవకాశం ఉందని, ముఖ్యంగా
విద్యార్థులు, వైద్యులు వంటివారు ఒకేసారి వినడం, ఆలోచించడం, రాయడం వంటి బహుళ పనులు నిర్వహించే సందర్భాల్లో రాత స్పష్టత తగ్గవచ్చని పేర్కొంటున్నారు. అయితే, చేతిరాత నాణ్యతకు వ్యక్తి మేధస్సు, వ్యక్తిత్వం, సామర్థ్యాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయని వారు తెలిపారు.