అమెరికాలో భగ్గుమంటున్న ఎండలు

9154చూసినవారు
అమెరికాలో భగ్గుమంటున్న ఎండలు
అమెరికాలోని బోస్టన్, న్యూ ఇంగ్లండ్ ప్రాంతాలు ఈ వారం తీవ్రమైన హీట్‌వేవ్స్‌ను ఎదుర్కోనున్నాయి. శక్తివంతమైన హీట్ డోమ్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలిలో తేమ కారణంగా ఉష్ణోగ్రతలు 105-110 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉండొచ్చని అంచనా. జూలై 4 వరకు కొనసాగే ఈ వేడి వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం బయటకు రాకూడదని సూచించారు. వృద్ధులు, పిల్లలు, కార్మికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్