ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమా 'రాకా' టైటిల్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. 'రాక్షసుడు' అనే అర్థం వచ్చేలా ఈ టైటిల్ ను ఎంచుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఒక పాత్రలో సగం మనిషి, సగం మృగం లాంటి వింత జీవిగా, మరో పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఈ వింత జీవి పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు. అయితే, ఈ లుక్ పై కొందరు విమర్శలు చేస్తూ, తమిళ నటుడు కార్తీ 'కష్మురా' చిత్రంలో, విక్రమ్ 'ఐ' చిత్రంలో ఇలాంటి గెటప్స్ వేసినట్లు పోల్చుతున్నారు. అయినప్పటికీ, ఇలాంటి ప్రయోగాలు చేయడానికి అల్లు అర్జున్ ధైర్యాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు.