పోలవరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సీతపల్లి వాగు

0చూసినవారు
పోలవరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సీతపల్లి వాగు
AP: పోలవరం జిల్లాలోని సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం, గుంపెనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు తాడు సాయంతో వాగును దాటుతున్నారు. ఒక తండ్రి తన బాలుడిని తాడు సాయంతో వాగు మధ్యలో నుంచి తరలించాడు. దామనపల్లి ఆసుపత్రికి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శాశ్వత వంతెన నిర్మాణంతోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్