శుభకార్యాల్లో కొబ్బరికాయలు ఎందుకు కొడతారో తెలుసా?

2359చూసినవారు
శుభకార్యాల్లో కొబ్బరికాయలు ఎందుకు కొడతారో తెలుసా?
శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టడం వెనుక మన అహంకారాన్ని దైవానికి సమర్పించాలనే గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. శ్రీఫలంగా గౌరవించే కొబ్బరి చెట్టును విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటు భూమిపైకి తెచ్చారని పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరిపై ఉన్న మూడు కన్నులు శివుడి త్రినేత్రాలను సూచిస్తాయి. కొబ్బరికాయను కొట్టడం మనలోని అహంకారం, స్వార్థం తొలగిపోవడాన్ని, లోపలి స్వచ్ఛమైన నీరు హృదయ పవిత్రతకు ప్రతీకగా నిలుస్తుంది. పూర్వకాలంలో జంతుబలికి బదులుగా కొబ్బరికాయను సమర్పించడం ప్రారంభమైందని, ఇది హింసకు బదులుగా భక్తిని ప్రతిబింబిస్తుందని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్