AP: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ముఖ్యంగా గూడూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సైదాపురం (42.6), ఒంటిమిట్ట (42.3), మార్కాపురం (42.1)లలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.