తిరుమల అలిపిరి మార్గంలో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ‘భూమనకు బండి తాళాలకు, గుడి తాళాలకు తేడా తెలియదు. ఆయన టీటీడీకి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. గత 20 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉంది. అది మహావిష్ణువు విగ్రహం కాదు’ అంటూ తెలిపారు.