తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం కట్టుకథలని ఏపీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కేవలం తన కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికే కలిశానని తెలిపారు. కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని
రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, శుభకార్యానికి, రాజకీయాలకు ముడిపెట్టి తన విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియా వేదికగా ఆమె హెచ్చరించారు.