AP: తిరుపతి రాజారెడ్డి కాలనీలో ఐదో అంతస్తు నుంచి దూకి పుష్ప అనే యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో సస్పెన్స్ వీడింది. మొదట రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు పడిపోయిందని అనుమానించిన పోలీసులు, విచారణలో ఇది ఆత్మహత్య అని నిర్ధారించారు. వరుసకు సోదరుడయ్యే యువకుడితో పుష్ప ప్రేమ వ్యవహారం నడిపిందని, విషయం తెలిసి తల్లి మందలించడంతో ఆవేశంలో ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.