AP: వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌కు ఉచ్చు బిగుస్తోందని, ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ జరుగుతోంది. గతంలో భరత్‌కు సన్నిహితుడైన రామకృష్ణ వద్ద పనిచేసిన రామశర్మ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. రెడ్ గ్రావెల్ మైనింగ్, ఇసుక ర్యాంప్‌లు, బుర్రిలంక ఇసుక ర్యాంప్‌కు సంబంధించి నెలకు రూ. 5 కోట్ల వరకు మామూళ్లు వసూలు చేశామని శర్మ వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భరత్ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.