విడిపోయేటప్పుడు తెలిసిన బంధం విలువ.. కోర్టు మెట్లపై ఒక్కటయ్యారు

4254చూసినవారు
ఢిల్లీలో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన శిఖ సింగ్, సౌరభ్ అనే జంట తిరిగి ఒక్కటయ్యారు. 2020లో వివాహం చేసుకున్న వీరికి కొద్దిరోజుల్లోనే విభేదాలు రావడంతో విడిపోయారు. శిఖ, సౌరభ్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో శిఖ తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో పడి, గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అప్పుడు సౌరభ్ తన మామకు ప్రైవేట్ ఆసుపత్రిలో తన డబ్బులతో వైద్యం చేయించి, వారిని తిరిగి కలపడానికి కారణమయ్యాడు. ఇటీవల విడాకుల కేసు విచారణకు కోర్టుకు హాజరైనప్పుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్