AP: రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అనారోగ్యంతో మరణించడంతో ఆయన భార్య సరస్వతి, సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి, హిందూ సంప్రదాయం ప్రకారం భర్త పార్థివ దేహానికి స్వయంగా తలకొరివి పెట్టారు. జీవితాంతం తోడుగా ఉన్న భర్తకు చివరి వీడ్కోలు పలకాలని ఆమె నిర్ణయించుకున్నారు. భర్త చితిపై కాలిపోతుండగా ఆమె రోదించిన తీరు, స్మశానవాటికలో ఉన్నవారిని కంటతడి పెట్టించింది. భర్తపై ఉన్న అనంతమైన ప్రేమతో ఆమె చేసిన ఈ సాహసోపేతమైన పని స్థానికంగా అందరినీ కదిలించింది.