ముంబయిలోని కాఫీ పరేడ్ ప్రాంతంలో యువతిపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. 2025 సెప్టెంబర్‌లో యువతి అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 20 మందికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా అసలు నిందితుడు తండ్రేనని నిర్ధారణైంది. మొదట కుమార్తె గర్భం ఎలా దాల్చిందో తెలియదంటూ బుకాయించిన తండ్రి, ఫిర్యాదుకు కూడా నిరాకరించాడు. పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.