నటుడు జయం రవి ఇంట్లో దొంగతనం.. డ్రైవర్ అరెస్ట్

1778చూసినవారు
నటుడు జయం రవి ఇంట్లో దొంగతనం.. డ్రైవర్ అరెస్ట్
చెన్నై ఇంజంబాక్కంలో నటుడు జయం రవి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఆయన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు లాకర్ నుంచి డబ్బు దొంగిలించినట్లు అంగీకరించగా, అతని నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న రూ.10 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఇంకా లభ్యం కాలేదు. దానిని ఎక్కడ దాచాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్