వారికి నెలకు పింఛన్ రూ.19 మాత్రమే.. కానీ?

20277చూసినవారు
వారికి నెలకు పింఛన్ రూ.19 మాత్రమే.. కానీ?
ఏపీలో వారికి పింఛన్ నెలకు రూ.19 మాత్రమే. కొంచెం విచిత్రంగా అనిపించినా.. ఇదే నిజం. కర్నూలు జిల్లా మద్దికెర ప్రాంతానికి చెందిన యాదవరాజుల కుటుంబాలకు బ్రిటిష్ కాలం నుంచి అందించిన ‘పాలేగార్ పింఛన్’ ఇది. యాదవరాజుల భూములు, అధికారాలను అప్పటి ప్రభుత్వం తీసుకోవడంతో.. వారికి పాలేగార్ పింఛన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే నెలకు రూ.19 పింఛన్ కూడా 14 ఏళ్ల నుంచి రావడం లేదట. తమకు పాలేగార్ పింఛన్ అందించాలని యాదవరాజుల కుటుంబాల వారసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్