బాపట్ల జిల్లా బొల్లాపల్లి మండలంలోని రెడ్డిపాలెం గ్రామం, నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన పల్లె. సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో, ప్రతి ఇంట్లో కనీసం ఒక ఉద్యోగి ఉన్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలలో 65 మంది ఉద్యోగులు, 16 మంది ఉపాధ్యాయులు, 8 మంది బ్యాంకు ఉద్యోగులు, పోలీస్, పోస్టల్, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల వంటి రంగాలలో అనేక మంది పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారితో కలిపితే, ప్రతి ఇంట్లో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.