కుప్పంలోనూ బంగారం గనులు

20చూసినవారు
కుప్పంలోనూ బంగారం గనులు
AP: చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారం గనులు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ప్రఖ్యాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)కు దగ్గరగా ఉండటంతో మైనింగ్ బెల్ట్ కుప్పం దాకా విస్తరించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాంతో కుప్పంలోనూ గోల్డ్ మైనింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమై.. మార్కెట్‌లో బంగారం కూడా వచ్చేసింది.

సంబంధిత పోస్ట్