ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడం, వర్షపాతం తగ్గడం లేదా మధ్యలో వర్షాలు లేకపోవడం లాంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో పెరిగే, తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను నీటి వనరు ఉన్నవారే సాగు చేయాలని సూచిస్తున్నారు. సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు, పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాలు, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలను తక్కువ నీరు ఉన్నవారు వేసుకోవచ్చని సూచిస్తున్నారు.