AP: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘రైతులకు మద్దతు ధర, సబ్సిడీ, ఎరువులు వచ్చాయని అంటున్నారు. అది రైతుల దగ్గరికి వెళ్లి అడిగితేనే అసలు నిజం తెలుస్తుంది. అమ్మఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, సిలిండర్లు లేవు. నిత్యావసర ధరలు తగ్గించలేదు. ప్రజల ఆదాయం పెరగలేదు’ అని అన్నారు.