AP: జోగి రమేష్ బుధవారం సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలని చూస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు. తమ అధినేత జగన్‌పై అయ్యన్నపాత్రుడు కారుకూతలు కూస్తుంటే నిరసన తెలియజేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లినందుకే, నేడు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ రోజు తనపై దాడి చేసి, తిరిగి తనపైనే కేసులు పెట్టారని అన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.