భారతదేశం నుండి ద్విచక్ర వాహనాల ఎగుమతిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. గత ఏడాది 43 లక్షల బైకులను ఎగుమతి చేసిన భారతదేశం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాలలో భారత బైకులు అధిక డిమాండ్‌లో ఉన్నాయి. జపాన్, చైనా బైకులతో పోలిస్తే నాణ్యత, ధరల పరంగా భారత బైకులు మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. హీరో, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు విడిభాగాల సరఫరా, డీలర్లకు శిక్షణ వంటి సపోర్ట్‌ను అందిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నాయి.