AP: ఈ ఏడాది రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంటుందని, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని CM చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. గతంలో విధ్వంసకర పాలన జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్టీ శ్లాబులు తగ్గించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్నామని చెప్పారు.