AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ వేడుకల్లో భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పోలీస్ యూనిఫాంలో.. ‘భీమవరం సంక్రాంతి సంబరాల్లో అసలు ఊపు లేదు. ఓరోరి యోగి నన్ను కుదిపేయరో అంటూ డ్యాన్సర్లు పాడుతుంటే.. కనీసం ఎవరూ కుదుపుకోకపోతే ఎలాగయ్యా? ఆమె అక్కడ కుర్చీ మడతపెడుతుంటే.. కనీసం ఎవరూ మడతపెట్టకపోతే ఎలా?’ అని డీఎస్పీ ప్రశ్నించారు.