పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజా సాబ్' సంక్రాంతికి విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో దర్శకుడు మారుతిపై విమర్శలు వచ్చాయి. ప్రభాస్-మారుతి మళ్లీ కలిసి పనిచేస్తారని, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుందని రూమర్లు వచ్చినా, ప్రభాస్ పీఆర్ టీమ్ అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. దీంతో ఈ కాంబోలో కొత్త సినిమా లేదని తేలింది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'ది రాజా సాబ్' ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.