AP: కూటమి ప్రభుత్వం భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేపోతున్నారని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌లో సరైన ఆధారాలు సేకరించడంలో సిట్ పూర్తిగా విఫలమైందన్నారు.