AP:
టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి,
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో
వైసీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై వీడియో రికార్డులు ఉన్నప్పటికీ తమపైనే కేసులు బనాయించడం అన్యాయమని అన్నారు. చంద్రబాబు అనైతికంగా, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులను వేధిస్తున్నారని, వారి పంటలను నాశనం చేస్తున్నారని విమర్శించారు.