AP: మెగా డీఎస్సీ 2025 నియామకాలపై సుప్రీంకోర్టు లేదా సీబీఐ విచారణ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన దాడి ఘటనతో పాటు డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.