బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దారి తప్పిందని సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో 7.5 శాతంగా ఉన్న ఉత్పాదకత వృద్ధి ప్రస్తుతం 3.5 శాతానికి పడిపోయిందన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92కి దిగజారిందని గుర్తుచేశారు. పెరుగుతున్న ఆర్థిక గందరగోళంపై కేంద్రానికి పట్టింపులేదని విమర్శించారు. సమస్యలను చక్కదిద్దే దిశగా ఒక్క గట్టి ప్రయత్నం కూడా లేదన్నారు. ఫ్రీ ఫాల్‌లో ఉన్న ఆర్థిక సూచికలకు బడ్జెట్ పరిష్కారం చూపుతుందా? అని ప్రశ్నించారు.