దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టాయిలెట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అలాగే, పాఠశాలల్లో బాలికల పరిశుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని న్యాయస్థానం పేర్కొంది.