ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరోయిన్ కృతిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకసారి బ్రేకప్ అయిందని తెలిపింది. ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని కృతి చెప్పడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ‘ఇంత అందమైన అమ్మాయితో బ్రేకప్ ఎవరు చేసుకున్నారురా’ అని సినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.