'లియాకి ఫ్రీడమ్' నౌకపై దాడి జరగలేదు: కేంద్రం (VIDEO)

9386చూసినవారు
భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై సైనిక దాడి జరిగిందన్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. నౌక కెప్టెన్‌తో మాట్లాడిన అనంతరం సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకపై దాడి జరిగి నలుగురు భారతీయ నావికులు మృతిచెందారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని డీజీ షిప్పింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో వదంతులు వ్యాపించాయని పేర్కొన్నారు. వాటిని నమ్మొద్దని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్