విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం చంద్రబాబు

94చూసినవారు
విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. "రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా వరకూ తీసుకెళ్తాం"అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్