AP: కృష్ణా జిల్లా పమిడిముక్కల సభలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఛార్జీలపై హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఛార్జీలు పెంచబోమని ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, వైసీపీ ప్రభుత్వం విధించిన ట్రూఅప్ ఛార్జీలను తగ్గించామని గుర్తు చేశారు. గతంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని సీఎం విమర్శించారు.