AP: విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై
వైసీపీ నేతల దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదన్నారు. సోమవారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. ‘పేపర్ లీక్ అయితే.. అదే వారికి చివరి రోజు. మెగా డీఎస్సీలో అవినీతికి తావు ఉండదు. నా హయాంలో పేపర్ లీక్ జరగవు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని అన్నారు.