AP: ఇంటి పన్ను వసూళ్ల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈ నెలలో సెలవులు రద్దు చేస్తూ రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వేలు, పన్నుల వసూళ్ల టార్గెట్ కారణంగా పని ఒత్తిడి పెరుగుతోందని, ఈ నెలంతా సెలవుల రద్దు ఆదేశాల జారీపై ఉద్యోగ సంఘం నేతలు మండిపడుతున్నారు. కాగా, మార్చిలోనే హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి పండుగలతో పాటు ఆది, శనివారాలు కలిపి దాదాపు 10 రోజులు అధికారిక సెలవులు వస్తున్నాయి.