వారణాసి సీక్వెల్ ఉండదు: రాజమౌళి

5996చూసినవారు
వారణాసి సీక్వెల్ ఉండదు: రాజమౌళి
దర్శకుడు రాజమౌళి 'వారణాసి' సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ, మొదట్లో రెండు భాగాలుగా తీసే అవకాశం పరిశీలించినా, కథకు అవసరం లేదని సింగిల్ సినిమాగానే తెరకెక్కుతుందని తెలిపారు. మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో మైథాలజీ, అడ్వెంచర్ జానర్ కలగలిసి ఉంటాయి. ప్రభాస్ 'కల్కి'తో పోలిస్తే 'వారణాసి'లో మైథాలజీ భాగం 25-30 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు రాముడి పాత్ర కోసం ఆరు నెలల శిక్షణ తీసుకున్నారు. సినిమా షూటింగ్ 50% పూర్తయింది, సెప్టెంబర్ లోపు మిగిలినది కూడా పూర్తవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్