“ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్

22777చూసినవారు
“ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, అమెరికా సైనిక చర్యను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. “అలా జరిగితే ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు” అని ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి సమీపంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగగా, ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్