రాత్రివేళ చపాతీలకు బదులుగా జొన్న లేదా రాగి రొట్టెలు తీసుకోవడం ఆరోగ్యకరం. జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు తోడ్పడగా, రాగి రొట్టె రక్తహీనతను నివారిస్తుంది. వీటిని క్యారెట్, బీన్స్, బీట్రూట్ వంటి కురాలతో కలిపి తీసుకొంటే పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయని, బరువు తగ్గడానికి మధుమేహ నియంత్రణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.