AP: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. బోటు యజమాని చిన్న మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన కారె సీతోడు, కారె చిన్నయ్య, కారె గరగయ్య, అయ్మోరు చిన్న, అమర అప్పలరాజుతో పాటు విశాఖ జిల్లా నాగమయ్య పాలేనికి చెందిన బండయ్య కూడా ఉన్నారు. వీరి కోసం కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు గాలిస్తున్నారు.