కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక లోటు, క్యాపెక్స్, అప్పులు, పన్నులపై మార్కెట్ల దృష్టి ఉంది. FY26లో ఆర్థిక లోటును జీడీపీలో 4.4%గా అంచనా వేశారు. క్యాపెక్స్ రూ.11.2 లక్షల కోట్లుగా ఉండగా, దీన్ని రూ.12 లక్షల కోట్లకు పైగా పెంచే అవకాశం ఉంది. స్థూల అప్పులు రూ.14.8 లక్షల కోట్లు. పన్ను ఆదాయం రూ.42.7 లక్షల కోట్లు, జీఎస్టీ వసూళ్లు రూ.11.78 లక్షల కోట్లు కావచ్చని అంచనా. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.