దేశ చరిత్రలో అతి పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉంది. ఆమె 2020 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను 2 గంటల 40 నిమిషాల పాటు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. మరోవైపు, 1977లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం ఇప్పటివరకు అతి చిన్నదిగా నిలిచింది. ఆ ప్రసంగం కేవలం 800 పదాలకే పరిమితమైంది.