ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, సురక్షితమైన దేశాలపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) నివేదిక ప్రకారం, ఐస్‌లాండ్ అత్యంత సురక్షితమైన దేశంగా మొదటి స్థానంలో ఉండగా, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, సింగపూర్, పోర్చుగల్, డెన్మార్క్, స్లోవేనియా, ఫిన్లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.