AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసాలు, సంస్థల్లో గురువారం సిట్ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. రాత్రి వరకు విచారణ జరిగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరును అక్రమ కేసుతో నాశనం చేయాలని చూస్తున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానిపై ఎక్కువ మాట్లాడను’ అని ఆయన అన్నారు.