AP: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై బ్లేడ్ బ్యాచ్‌తో టీడీపీ దాడులు చేయించిందని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం రాత్రి సత్యనారాయపురం PSలో అవినాష్ మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బదులు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమని ఫైర్ అయ్యారు.