కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నెల 27న శస్త్రచికిత్స కోసం వచ్చిన యువకుడి కాలు నుంచి స్క్రూ తీసి, లోపల సర్జికల్ బ్లేడును వదిలేసి కుట్లు వేశారు. నొప్పి రావడంతో ఎక్స్‌రే తీయించుకున్నాక బ్లేడు బయటపడింది. వైద్యులు 28న మరోసారి శస్త్రచికిత్స చేసి బ్లేడును తొలగించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.