ఆ గొడ్డలితోనే తెగనరికి భూమిలో పాతిపెడతారు.. కొడాలి వార్నింగ్ (వీడియో)

14చూసినవారు
AP: గుడివాడ వైసీపీ ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమది గొడ్డలి పార్టీ అంటూ కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. 2029 ఎన్నికల్లో పరశురాముడి గొడ్డలిని ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు ఇవ్వబోతున్నారని చెప్పారు. చంద్రబాబుకు, ఆయన మీడియాకు జగన్ గొడ్డలిలాగే కనిపిస్తారని, అందులో తప్పులేదన్నారు. ఆ గొడ్డలితోనే కూటమి పార్టీని తెగనరికి భూమిలో పాతిపెడతారని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్